తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుపతికి వచ్చిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి సన్నిధిలో దాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. ప్రచారానికి వెళ్లడానికి ముందు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చంద్రబాబుకు ఆనవాయితీ.