Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కసబ్‌ కేసు వాదిస్తా: అంజలి

Anjali Waghmare
ముంబయి: ముంబయి దాడుల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ కేసును వాదించేందుకు న్యాయవాది అంజలి వాగ్మారే అంగీకరించారు. ఈ కేసులో వాదించవద్దని వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లను, శివసేన బెదిరింపులను తట్టుకోలేని ఆమె ఈ కేసును వాదించబోనని ప్రకటించారు. అయితే ఆమెకు జడ్‌ కేటగిరీ రక్షణ కల్పిస్తామని హామీ లభించటంతో ఈ కేసును వాదించేందుకు అంగీకరించారు. ఈ మేరకు జస్టిస్‌ తహిల్యానీకి ఆమె తన అంగీకారం తెలిపారు.

ఈ కేసును ప్రజల దృష్టికి తెస్తున్నందుకు ఆమె మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ కేసును వాదించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తన ఇంటిపై దాడికి తాను దిగ్భ్రాంతి చెందానని, ఈ దాడి తర్వాత తనకు తగిన భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తనకు జెడ్ కెటగిరీ భద్రత కల్పించారని ఆమె చెప్పారు. ముంబయి దాడుల కేసుపై ఈ నెల 6వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+