చిరు రైలింజన్ కు కోర్టు చిక్కులు

Chiranjeevi
న్యూఢిల్లీ: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల సంఘం రైలింజన్ గుర్తును కేటాయించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ గుర్తు తమకే కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో తాము ఆ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశామని, అందువల్ల ఆ గుర్తును తమకు కేటాయించడం న్యాయమని ఆ పార్టీ వాదిస్తోంది.

తమది గుర్తింపు పొందిన పార్టీ కాదని, అలాగే ప్రజారాజ్యం పార్టీకి కూడా గుర్తింపు లేదని, అందువల్ల ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించాలనే విషయంపై లాటరీ వేసి నిర్ణయించడమైనా చేయాలని ఆ పార్టీ అంటోంది. తాము ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. మలి విచారణ రేపు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+