న్యూఢిల్లీ: జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఫిలిభిత్ అభ్యర్థి వరుణ్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరుణ్ ను బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని ఈటా జైలుకు తరలించారు. వరుణ్ ను అక్రమంగా నిర్బంధించారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రహతోగి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.
పిటిషన్ పై గురువారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ తో కూడిన సుప్రీంకోర్టు బెంచీ రహతోగికి తెలియజేసింది. వరుణ్ కోసం తాను హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తానని రహతోగి కోర్టుకు తెలియజేశారు.