తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈరోజు తిరుపతిలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకంటే ముందు ఆయన కుమారుడు రాంచరణ్ తేజ, భార్య సురేఖ ఆతర కుటుంబసభ్యులు తిరుపతి చేరుకుని తిరుమలలో పూజలు నిర్వహించారు. అనంతరం పాలకొల్లు నుంచి నేరుగా రేణిగుంట వచ్చిన చిరంజీవికి వారు ప్రజారాజ్యం నేతలతో కలిసి స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఆ తరువాత రోడ్‌షో చేపట్టారు.