57 సీట్లతో చిరు కింగ్ మేకర్: 'వీక్' సర్వే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని "ది వీక్" వార పత్రిక సర్వే నివేదిక పేర్కొంది. 294 సీట్ల శాసనసభలో 124 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్, తెలుగుదేశాల ఓట్లను ప్రజారాజ్యం భారీఎత్తున చీలుస్తుందని, 57 సీట్లతో చిరంజీవి కింగ్ మేకర్‌గా అవతరిస్తారని తెలిపింది. వీక్ తరఫున సి-ఓటర్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే వివరాలు సమగ్రంగా లేవు.
వివరాలు...
* కాంగ్రెస్ 39 శాతం ఓట్లు సాధిస్తుంది. సీట్ల సంఖ్య 124కు పడిపోతుంది.
* తెలుగుదేశానికి 29 శాతం ఓట్లు లభిస్తాయి. ఓట్ల శాతం తగ్గినప్పటికీ 106 సీట్లు లభిస్తాయి.
* 'సున్న' నుంచి మొదలెట్టిన కొత్తపార్టీ ప్రజారాజ్యం 21 శాతం ఓట్లతో 57 సీట్లను సాధిస్తుంది.
* రాష్ట్ర ప్రజల్లో 43 శాతం మంది ప్రభుత్వంలో మార్పు కోరుతున్నారు.
* ముఖ్యమంత్రిగా వైఎస్సే ఉండాలని 30 శాతం మంది, చంద్రబాబు మళ్లీ రావాలని 26 శాతం మంది, చిరంజీవి కావాలని 26 శాతం మంది కోరుకుంటున్నారు. 18 శాతం మంది ముగ్గుర్లో ఎవర్నీ తేల్చుకోలేక పోయారు.
ఈ సర్వేలో 119 సీట్లున్న తెలంగాణ ప్రాంతంలో బలమైన పార్టీలుగా ఉన్న తెరాస, వామపక్షాలు, ఎంఐఎంల ప్రస్తావన లేదు.












Click it and Unblock the Notifications