హైదరాబాదులో 'లెట్స్ ఓట్' వాక్
హైదరాబాద్: ఓటు వేయని వారిని చైతన్యపరిచేందుకు ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో లెట్స్ ఓట్ వాక్ జరిగింది. 'సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ లెట్స్ ఓట్' అనే స్వచ్ఛందసంస్థ దీన్ని నిర్వహించింది. గత ఎన్నికల్లో విద్యావంతులు అధికంగా ఉండే జూబ్లీహిల్స్‌లో 22 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు కావటంతో ఈ సంస్థ ఈసారి అలా జరగకుండా తమ వంతుగా ఈ కార్యక్రమం నిర్వహించింది.
హైదరాబాదులోని నెక్లెస్‌రోడ్డునుంచి సచివాలయం వరకు మెగా వాక్ నిర్వహించారు. పలు సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావుకూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications