పని మనుషులకు సీట్లిచ్చారు: మారెప్ప
కర్నూలు: మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు మూలింటి మారెప్ప మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై, పరోక్షంగా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై దురుసు వ్యాఖ్యలు చేశారు. పార్టీపై విమర్శలు చేశారు. అర్హులకు ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్లు రాలేదని ఆయన విమర్శించారు. సంస్కారవంతులు, గొప్పవారు చాలా మందికి కాంగ్రెసు సీట్లు ఇవ్వలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
బాంచెన్ దొర కాల్మొక్తా అన్నవారికి, పని మనుషులకు టిక్కెట్లు ఇచ్చారని ఆయన అన్నారు. ఆత్మగౌరవం ఉన్నవారికి మొండిచేయి చూపారని ఆయన తప్పు పట్టారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బాబూ జగజీవన్ రామ్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మారెప్పకు ఈ ఎన్నికల్లో కాంగ్రెసు టిక్కెట్ లభించలేదు.












Click it and Unblock the Notifications