ఎన్టీఆర్ కు కాంగ్రెస్ దిష్టి: బాబు

Chandrababu Naidu
వరంగల్: జూనియర్ ఎన్టీఆర్ కు కాంగ్రెసు దిష్టి తగిలిందని, అందుకే ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ బాగా కోలుకుంటున్నారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం ప్రసంగించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ సునామీ సృష్టించారని ఆయన అన్నారు.

మహిళలను లక్షాధికారులను చేస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని, కానీ వారిని రాజశేఖర రెడ్డి బిక్షగాళ్లుగా మార్చారని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి డబ్బులు ఎన్నికల్లో పంచడానికి సిద్ధపడుతోందని, డబ్బులకు ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు. తన పరువు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పరువు కాపాడడానికి తెలుగుదేశం, తెరాసల అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తాము ఎన్నికల్లో గెలిస్తే కలర్ టీవీలు ఇస్తామని, కాంగ్రెస్ గెలిస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా రాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+