ఎన్టీఆర్ కు కుమారస్వామి ఆహ్వానం

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఆయన బుధవారం ఓ ప్రత్యేక బెల్టు ధరించి ఆస్పత్రి కారిడార్‌లో కొద్దిసేపు నడిచారు. ఆ బెల్టు మెడ నుంచి నడుము వరకు ఉంటుందని, దాని సహాయంతో రోజూ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున నడవడానికి అనుమతిచ్చినట్లు చికిత్స చేస్తున్న వైద్యుడు శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని వెల్లడించారు. ఆయనకు మరో నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆరోగ్య స్థితిని చూసి రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications