చిరు పార్టీకి పరకాల గుడ్ బై
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి పరకాల ప్రభాకర్ గుడ్ బై చెప్పారు. పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రజారాజ్యం పార్టీ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. నేతలెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన తన రాజీనామా లేఖను కార్యాలయ సిబ్బందికి అందజేశారు.
ప్రజారాజ్యం నుంచి తాను వైదొలుగుతున్నానని ఆయన తన లేఖలో చెబుతూ తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కోరారు. ఆయన ఏకవాక్య లేఖనే రాశారు. అంతకు మించి ఆయన మరో మాట రాయలేదు. అయితే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాకు గల కారణాలను వివరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications