చిరు రైల్లో పవన్, రామచరణ్, అర్జున్

Chiranjeevi
హైదరాబాద్: రేపటి నుంచి తాను ప్రజా రైలు యాత్ర చేపడుతున్నట్లు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పారు. తమ యాత్ర సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వరకు, ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి రేణిగుంట వరకు సాగుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తమది న్యాయ సామాజిక సాధన శకటమని ఆయన చెప్పుకున్నారు. తమ పార్టీ విషవృక్షం కాదని, కల్పవృక్షమని ఆయన అన్నారు. పార్టీకి రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ ఆరోపణలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.

తమ పార్టీ అభ్యర్థుల జాబితాను, మిగతా పార్టీల అభ్యర్థుల జాబితాను పోల్చి చూస్తే ఎవరు పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు, డబ్బున్న వారికి ఇచ్చిందో తెలుస్తుందని ఆయన అన్నారు. పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజమని ఆయన అన్నారు. సర్వేల ఫలితాలన్నీ తారుమారు చేసి తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము టికెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. అటువంటి ఆరోపణలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+