మావోల దాడి: 11 మంది మృతి
భువనేశ్వర్: ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో గల నాల్కో ప్రభుత్వం రంగ సంస్థపై మావోయిస్టుల దాడి ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా మావోయిస్టులకు, సిఐఎస్ ఎఫ్ జవాన్లకు మధ్య ప్రారంభమైన ఎదురు కాల్పులు సోమవారం ఉదయం ముగిశాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు సిఐఎస్ ఎఫ్ జవాన్లు, నలుగురు నక్సలైట్లు మరణించారు.
దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఆదివారం రాత్రి బాక్సైట్ గనులపై దాడి చేశారు. గనుల ప్రాంతంలోని క్యాంటీన్ లో జవాన్లు ఉన్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేశారు. మావోయిస్టులు దాదాపు వంద మంది ఉద్యోగులను బందీలుగా తీసుకున్నారు. ఉద్యోగులందరూ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications