తొడలు కొడ్తామే గానీ..: బాలయ్య

Balakrishna
గుంటూరు: మీసాలు మెలేస్తాం గానీ మెడలు కొయ్యం, తొడలు కొడతాం గానీ కడుపులు కొట్టబోమని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ అన్నారు. ఆయన గురువారం గుంటూరు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన పాలనలో శ్రమదానం ప్రవేశపెడితే తన కుమారుడు జగన్ కోసం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భూదానం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజల వద్దకు పాలన పెడితే, వైఎస్‌ మాత్రం జగన్‌ వద్దకు పాలన పెట్టారన్నారు. టీడీపీ పాలన లో దున్నే వాడిదే భూమి అయితే వైఎస్‌ పాలనలో తన్నే వాడిదే భూమి అన్నట్లుగా తయారైందని ఆయన అన్నారు. కంటి చూపుతో కాదు ఓటుతో కాంగ్రెస్‌ ను రాష్ట్రంనుంచి తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

పౌరుషానికి ప్రతీక అయిన బ్రహ్మనాయుడు పుట్టిన ప ల్నాటి గడ్డలో ప్రతి పౌరుడు అవినీతి కాంగ్రెస్‌ ను పారదోలేందుకు ఓటునే ఆయుధంగా మలచుకోవాలన్నారు.ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే రైలింజన్ ప్రజల మీదికే దూసుకెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం, మెచ్చుకోవడం అనే మూడు సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు..జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగుతోందని ఆయన అన్నారు. ప్రతి కార్యక్రమంలో కమిషన్లు తీసుకుంటున్నారని, వాటిలో కొంత మొత్తాన్ని ఢిల్లీ పెద్దలకు కాంగ్రెసు నాయకులు కొంత మొత్తం ఇచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+