ఎన్నికలను బహిష్కరించిన గ్రామాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని కొద్ది గ్రామాల ప్రజలు వివిధ కారణాల వల్ల పోలింగ్ ను బహిష్కరించారు. గురువారం ఉదయం రాష్ట్రంలోని 15 జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా తనికెళ్ల ఎస్సీ కాలనీ ప్రజలు, మేడేపల్లి గ్రామ ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించలేదంటూ వారు ఎన్నికల బహిష్కరణకు పూనుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓట్లు వేయబోమని వారు మొరాయిస్తున్నారు.
ఇదిలా వుంటే, ఇవియంలు తక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా కొమురాడ మండలం గుణానపురం గ్రామ ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా నర్కోడ గ్రామ ప్రజలు పోలింగును బహిష్కరించారు. అక్రమంగా అరెస్టు చేసిన 15 మంది తమ గ్రామస్థులను విడుదల చేసే వరకు ఓటు వేయబోమని వారు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అయిజ గ్రామంలో ఎన్నికలు బహిష్కరించాలని కరపత్రాలు పంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా ప్రజలు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications