పోలింగ్: ఇవియంల మొరాయింపు

తొలి విడత పోలింగ్ జరుగుతున్న అన్ని జిల్లాల్లోనూ పలు చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలింగ్ అర గంట, గంట ఆలస్యంగా ప్రారంభమైన ఉదంతాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ విషయంపై హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయరామారావు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉండటంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
తొలి విడతలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, పురంధేశ్వరి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఫరీదుద్దీన్, బిజెపి జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనారెడ్డి వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications