వరుణ్ కు రెండు వారాల పెరోల్

జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద అరెస్టయిన వరుణ్ కోర్టుకు కూడా అదే విధమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మంగళవారం ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందలేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. వరుణ్ గాంధీ 50 వేల రూపాయలకు వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి రెండు సూరిటీలు కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో తాను ఎక్కడ ఉంటాడనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫిలిబిత్ మెజిస్ట్రేట్ కు తెలియజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. వరుణ్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఫిలిబిత్ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు పర్వం ఈ నెల 17వ తేదీన ప్రారంభమవుతుంది. ఫిలిభిత్ నుంచి బిజెపి అభ్యర్థిగా వరుణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications