ఇంటర్ ఫిస్టియర్: బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్టు శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎప్పటి లాగే బాలుర కన్నా బాలికలే ఎక్కువ మంది ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించారు. బాలురు 44.11 శాతం మంది పాస్ కాగా బాలికలు 49.79 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా సాధించగా మహబూబ్ నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలో 63 శాంత మంది విద్యార్థినీ విద్యార్థులు పాస్ కాగా మహబూబ్ నగర్ జిల్లాలో 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3 లక్షల 74 వేల 174 మంది విద్యార్థినీ విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 46.64 ఉంది. ఇది నిరుటి కన్నా తక్కువ.












Click it and Unblock the Notifications