Talliki Vandanam: తల్లికి వందనం ఆ రోజే- నిధులపై సర్కార్ ఆదేశాలు..!
ఏపీలో విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తల్లికి వందనం (talliki vandanam) పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిధుల విడుదలపై ఇవాళ స్పష్టత ఇచ్చింది. అలాగే ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. దీంతో విద్యార్ధుల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుత విద్య సంవత్సరంలో తల్లికి వందనం పథకం నిధుల్ని ఈ నెల 22న విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతోంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి లేదా ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్ధుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది పథకం అమలుకు రూ.10, 120 కోట్లు ఖర్చవుతుందని లెక్క తేల్చారు. దీని ప్రకారం నిధుల విడుదలకు అనుమతులు ఇస్తూ ఇవాళ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తల్లికి వందనం పథకానికి అర్హులైన విద్యార్ధులను ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఈ జాబితాలను మాత్రం ఈ నెల 22న సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అదే రోజు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు కూడా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది తరహాలోనే ఈసారి కూడా విద్యార్ధికి రూ.13 వేల చొప్పున ఖాతాల్లో నిధులు క్రెడిట్ చేస్తారు. అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఖాతాల్లోనూ నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న విద్యార్ధులకు మాత్రం ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు. పాత విద్యార్ధులకు మాత్రం ఈ నెల 22నే నిధులు పడతాయి.












Click it and Unblock the Notifications