తల్లికి వందనం నిధుల జమ తేదీ ఖరారు, తొలిగా వారికే - రెండో విడత అప్పుడే..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బడులకు వెళ్లే పిల్లలకు ఏటా రూ 15 వేలు ఇస్తామని హమీ ఇచ్చింది. గత ఏడాది ఈ పథకం అమలు చేసింది. ఈ సారి పథకం అమలు పైన తాజాగా నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 24న మెగా పేటీఎం నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది రెండు విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సరం వరుసగా రెండో ఏడాది పథకం నిధుల విడుదల పైన అధికారులు పూర్తి నివేదికలను సమర్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. నిధులు అందించాలని నిర్ణయించిన మేరకు లెక్కలు సిద్దం చేసారు. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలుచేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథ కం వర్తించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ నెల 24న మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

24న మెగా పేరెంట్స్ - టీచర్ల మీటింగ్
పథకం నిధులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ఉత్తర్వులు ఈ రోజు (బుధవారం) విడుదల కానున్నాయి. తొలి విడతలో రూ.10,049 కోట్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 66.9లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు గత ఏడాది తరహాలో నే తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం విద్యార్థికి రూ.2 వేలు చొప్పున ఆయా పాఠశాలలకు కేటాయిస్తారు. కాగా, అడ్మిషన్లు పూర్తయిన తరువాత కొత్తగా చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు, ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొంటారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రు లకు అవగాహన కల్పించడంతో పాటు, పథకం లబ్ధిని నేరుగా వారికి వివరించనున్నారు. అదే విధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించటం పైన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications