అల్లు అర్జున్‌తో మూవీపై మల్లు డైరెక్టర్ క్రేజీ అప్డేట్.. ఇక షురూ !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం బన్నీ అట్లీ, లోకేష్ లతో సినిమాలకు కమిట్ అయ్యి.. ఆ మూవీ షూటింగ్స్ లలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత బన్నీ.. మల్లు డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బన్నీతో సినిమాని డైరెక్ట్ చేయబోయేది.. మళయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్ అని అంటున్నారు. దర్శకుడిగా టోవినో థామస్ తో 'మిన్నల్ మురళి' అనే సూపర్ హీరో సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లిమిటెడ్ బడ్జెట్‌లో ఉన్నప్పటికీ.. మంచి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో అదరగొట్టింది ఈ సినిమా. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్‌తో బసిల్ జోసెఫ్ రూపొందించబోయే చేసిన భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని.. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం 'శక్తిమాన్' పాత్రను ఆధారంగా తీసుకుని ఉండొచ్చని సమాచారం. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఇదే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఇప్పుడు లేటెస్టుగా బన్నీ-బసిల్ కాంబోపై మరోసారి చర్చ మొదలైంది. బసిల్ సోషల్ మీడియాలో 'ఐకాన్' అని ముద్రించిన ఓ టోపీని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్టుకు 'రింగ రింగ' అంటూ బన్నీ పాటను బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా యాడ్ చేశాడు. అలానే ఈ ఫోటోలో కాస్త దూరంలో బ్లర్ గా ఇద్దరు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిందని అందరూ కన్ఫామ్ చేసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.
మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications