మ్యాథ్స్ లో 50 మార్కులు.. ఇప్పుడు నింగిలోకి విజయవంతంగా రాకెట్.. ఈ తెలుగు కుర్రాళ్ల స్టోరీ ఏంటి..?
రాకెట్ సైంటిస్ట్ చిన ఓ యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడు రాకెట్ కంపెనీని స్థాపించడం అంటే మాటలా..? అంతేకాకుండా భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంఅనగానే చాలామందికి అతని అసాధారణ ప్రతిభ, మార్కులు, ఎకాడమిక్ ఎక్స్ లెన్స్, మెడల్స్ ఇలా అన్నీ గుర్తుకువస్తాయి. కానీ మ్యాథ్స్ లో 51 మార్కులు సాధింగా ప్రయోగించి చరిత్ర సృష్టించడంతో ఇప్పుడు వారి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. మన హైదరాబాద్ కుర్రాళ్లు అయిన పవన్ కుమార్, నాగ భరత్ లు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించి ఇక్కడే ఈ విక్రమ్ 1 రాకెట్ ను రూపొందించారు. దీని క్లిష్టమైన ఏవియానిక్స్ సిస్టమ్స్ డిజైన్, అసెంబ్లింగ్, కీలక పరీక్షలన్నీ హైదరాబాద్ ఐటీ కారిడార్ లోనే జరగడం విశేషం.
అలా భారత తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఇవాళ ఉదయం 12 గంటల 6 నిమిషాలకు శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో ఈ ప్రయోగం చేపట్టారు. ఇక ఈ చరిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శ్రీహరికోటలోని లాంఛ్ కంట్రోల్ సెంటర్ కు హాజరయ్యారు. అలాగే గ్యాలరీలో వందలాది మంది విద్యార్థులు, యువత తరలివచ్చారు. రాకెట్ ప్రయోగాన్ని ఉత్సాహంగా తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలు, స్కైరూట్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పవన్ కుమార్, నాగ భరత్ ల విషయానికి వస్తే హైదరాబాద్ లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. పవన్ కు చిన్నప్పటి నుంచే మెషిన్స్, టెక్నాలజీ తదితర అంశాలపై పట్టు సాధించారు. స్టడీస్ లో వెనుకబడినప్పటికీ తన తండ్రి ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో క్రమంగా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పట్టు సాధించారు. అలా ఐఐటీ ఖరగ్ పూర్ లో చేరారు. ఐఐటీలో విజయవంతంగా ఇంజినీరింగ్ పూర్తి చేశారు. రూ. లక్షల ప్యాకేజీని వదిలి తన ప్రతిభతో ఇస్రోలో చేరారు. అక్కడే ఆరేళ్లు పని చేశారు. ప్రతిష్టాత్మక జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అందుకు గానూ పవన్ కూ ఇన్నోవేషన్ అవార్డు కూడా దక్కింది.

అలా ఓ ఆలోచనతో 2018 లో తన ఫ్రెండ్, ఐఐటీ గ్రాడ్యుయేట్ నాగ భరత్ తో కలిసి 'స్కైరూట్ ఏరోస్పేస్' ను హైదరాబాద్ లో స్థాపించారు. ఆ తర్వాత వీళ్లకు ఐఐటీ సీనియర్, ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అండగా నిలిచారు. అలా తమ కృషితో 2020 జూలైలో రామన్ 1 అనే రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ను పరీక్షించి చరిత్ర సృష్టించారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
మరోవైపు భారత్ తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం విక్రమ్ 1 విజయవంతంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్' అని సోషల్ మీడియా మాధ్యమం అయిన ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఈ మేరకు స్కైరూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications