పవన్ కళ్యాణ్ పై లోకేష్ నిఘా ? తేల్చేసిన ఏపీ సర్కార్...!

ఏపీలో కూటమి సర్కార్ (AP Govt) అధికారంలో వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఈ రెండేళ్లలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూ, మంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) కూ మధ్య సత్సంబంధాలే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తెరవెనుక మాత్రం నారా లోకేష్.. పవన్ కళ్యాణ్ పై నిఘా పెట్టారన్న ప్రచారం ఈ మధ్య జరుగుతోంది. ఇప్పటికే మిగతా మంత్రులపై సైతం లోకేష్ పెట్టారని, అందులో భాగంగానే పవన్ పై సైతం నిఘా పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది.

పవన్ కళ్యాణ్ పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ (Fact Check) ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరింది. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని కూడా ప్రభుత్వం వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హాండిల్స్ పై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. దీంతో ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది.

AP Govt Dismisses Reports of Nara Lokesh Conducting Surveillance on Pawan Kalyan

పవన్, లోకేష్ ఇద్దరూ మూడేళ్ల క్రితం రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఉంచినప్పుడు పరామర్శ సందర్భంగా కలిశారు. అప్పటి నుంచీ ఇద్దరూ పలు బహిరంగ సభల్లోనూ పాల్గొని ప్రచారాలు కూడా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా లోకేష్ ప్రతీసారీ పవన్ అన్నగా సంబోధిస్తూ ఆయనకు దగ్గరగా కనిపిస్తుంటారు. మధ్యలో మాత్రం కూటమి సర్కార్ లోకేష్ ను డిప్యూటీ సీఎం లేదా సీఎం చేస్తామంటూ సంకేతాలు పంపడంతో జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పట్లో ఈ ప్రచారాలకు సైతం చెక్ పెట్టాలని కూటమి పార్టీల పెద్దలు తమ క్యాడర్ కు సూచించాయి. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q