ప్రభాస్ "ఫౌజీ" రిలీజ్ డేట్ అనౌన్స్... తిరుగుబాటు మొదలైందంటూ !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మూవీ "ఫౌజీ". రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కాగా ఇన్ ఫ్లూయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ గా మూవీ టీం అభిమానులకు అదిరిపోయే తీపికబురు ప్రకటించింది. "అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది" అంటూ క్యాప్షన్ తో విడుదల తేదీ వెల్లడించింది.
కాగా ఈ చిత్రం డిసెంబర్ 3న గ్రాండ్ గా థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "సీతారామం" లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే పోస్టర్ ని సైతం రిలీజ్ చేయగా.. అందులో ప్రభాస్ రక్తపు మరకలతో, సిక్స్ ప్యాక్ బాడీతో, ఒక సైనికుడి గెటప్‌లో కూర్చొని కనిపిస్తున్నారు. చుట్టూ యుద్ధ భూమిలో పడి ఉన్న శవాలు, చేతిలో పట్టుకున్న గన్ చూస్తుంటే.. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది.

ఇక ఈ మూవీలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద సహా పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. రీసెంట్ గానే మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
अज्ञातपर्व ENDS.
— Fauzi (@FauziTheMovie) July 16, 2026
THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3
Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y
మరోవైపు ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications