విద్యామంత్రిగా సోనమ్ వాంగ్ చుక్-కేజ్రివాల్ డిమాండ్-పెరుగుతున్న మద్దతు..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో 19 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (sonam wangchuk)కు ప్రజామద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడం, కేంద్రం స్పందించకపోవడం, ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా తిరిగి ఓ హామీ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఇవాళ పలువురు బాలీవుడ్ నటీనటులు సోనమ్ వాంగ్ చుక్ కు మద్దతుగా గళం విప్పారు.
ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ వద్దకు ఇవాళ సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. సోనమ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్రం స్పందించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి సోనమ్ వాంగ్ చుక్ కు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించాలని అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు.

మరోవైపు ఇప్పటివరకూ సోనమ్ నిరాహారదీక్షపై మౌనంగా ఉన్న బాలీవుడ్ కూడా ఇవాళ గొంతు విప్పుతోంది. ఇవాళ ఎంపీ శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షి సిన్హా, మరో హీరోయిన్ ఆకాంక్షా సింగ్, నటుడు అతుల్ కులకర్ణితో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు సోనమ్ వాంగ్ చుక్ కు మద్దతుగా స్పందించారు. తమపై ఎలాంటి కేసులు పెట్టుకున్నా ఫర్వాలేదని, సోనమ్ కు మద్దతిస్తామని సోనాక్షి తెలిపింది. అలాగే ఆకాంక్షాసింగ్, అతుల్ కులకర్ణి వంటి వారు కూడా సోనమ్ ఆరోగ్యంపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.














Click it and Unblock the Notifications