వైయస్ పై హైకమాండ్ కు: విహెచ్
రాజమండ్రి: తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇతరులంతా విదేశీయుల్లా అవుతారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంకోసం వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏం మాట్లాడినా పార్టీకి నష్టమని అందుకే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమర్థించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాల్లో నిజం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె.చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications