29 కేంద్రాల్లో రీపోలింగ్
హైదరాబాద్: తొలి విడతలో పోలింగ్ నిలిచిపోయిన 29 కేంద్రాలలో శనివారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. ఆయా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ -19, కరీంనగర్-1, హైదరాబాద్-2, వరంగల్-1, ఖమ్మం-2, శ్రీకాకుళంలోని మూడు పోలింగ్ కేంద్రాలలో శనివారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని అయిజ పునర్విభజనలో అలంపూర్‌లో కలవడంతో అక్కడి ప్రజలు ఓటు వేయడానికి తిరస్కరించారు. దీనితో అక్కడ 17 కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది. అదేవిధంగా శ్రీకాకుళంలోని పలాసలో ఈవిఎం పనిచేయకపోవడంతో చీటిల ద్వారా ఓట్లు వేయించడంతో అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ఈవిఎంలు మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.












Click it and Unblock the Notifications