హత్య కేసులో కాంగ్రెస్ అభ్యర్థి అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్‌రెడ్డిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోని ఆయన ఇంటిలో అరెస్టు చేసి బెంగుళూరు తీసుకునివెళ్లారు. 1997లో బెంగుళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తిపై దాడి కేసులో పీణ్యం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం బాధితుడు మరణించటంతో దాన్ని హత్య కేసుగా మార్చారు.
ఈ కేసులో పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెల చెర్వు సూరి కూడా నిందితుడు. 2001లో ఓసారి కోర్టుకు హాజరైన ఆయన తరువాత కోర్టుకు హాజరుకాకపోవటంతో ఆయనకు 2004లో వారెంటు జారీ చేశారు. ప్రస్తుతం రాప్తాడులో హోరాహోరీగా ఎన్నికల పోరు సాగుతోంది. ఈ సమయంలో ప్రకాష్‌రెడ్డి అరెస్టు కాంగ్రెస్ వారిని విస్మయానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications