ఫిలిభిత్: బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీ బుధవారం మధ్యాహ్నం పిలిభిత్ లోక్ సభ స్ధానానికి నామినేషన్ దాఖలు చేశారు. 29 ఏళ్ల వరుణ్ తొలి సారిగా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ముస్లింలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లిన వరుణ్ రెండు వారాల పెరోల్‌పై విడుదల అయ్యారు. పిలిభిత్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది. వరుణ్ నామినేషన్ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. పిలిభిత్ నుంచి వరుణ్ కు ప్రత్యర్థిగా ఆయన సమీప బంధువు పీఎం సింగ్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగనున్నారు.