మంత్రి జెసి సోదరుడి వీరంగం

పోలింగ్‌కు ముందురోజు బుధవారం రాత్రే జెసి దివాకర్ రెడ్డి ప్రతాపం మొదలైంది. తెలుగుదేశం ఏజెంట్ల ఇళ్లకు వెళ్లిన మంత్రి జేసీ వారిని తెల్లవారి పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దని కోరారు. వారు ససేమిరా అనటంతో ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఈసీ భయంతో నిన్నటికి ఆగిన ఆయన అనుచరులు శుక్రవారం రెచ్చిపోయారు. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి పేరం నాగిరెడ్డి, టీడీపీ ఏజెంట్ల ఇళ్లపై దాడులు చేశారు. అడ్డువచ్చిన వారిని చితకబాదారు. అడ్డువచ్చిన మీడియా ఛానళ్లవారిని కూడా కెమెరా తీయవద్దని బెదిరించారు. కెమెరాలు లాక్కున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో తాడిపత్రిలో దుకాణాలు అన్నీ మూసివేశారు.












Click it and Unblock the Notifications