ఎన్నికల మద్యానికి 3గురు బలి
గుంటూరు: ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పంపిణీ చేసిన చీప్ లిక్కర్ సేవించి గుంటూరు జిల్లాలో సోమవారం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో సంభవించింది. ముగ్గురు మృతుల్లో కావూరి వీరయ్య, వెంకటేష్ ఉన్నారు.
ముగ్గురు రైతులు సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. పోలింగ్ రోజు రాజకీయ పార్టీలవారు ఇచ్చిన మద్యం సీసాను దాచి ఉంచిన స్థలం నుంచి తీసి సేవించారు. వెంటనే వారి నోటి నుంచి నురగలు రావడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గుర్తించిన కొంత మంది ఆ ముగ్గురిని దాచేపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు ముగ్గురు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications