కార్పోరేట్ వైరం లేదు: పాటిల్
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు వేసిన ఘటనలో రెండు గ్రూపుల మధ్య కార్పోరేట్ వైరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ప్రత్యక్ష సాక్షి భరత్ బోర్గే అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది. రెండు గ్రూపుల మధ్య వైరం ఉన్నట్లు, అందువల్లనే ఇది జరిగినట్లు ఆధారాలు లేవని రాష్ట్ర హోం మంత్రి జయంత్ పాటిల్ అన్నారు.
పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టడానికి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు, బురద వేసి అనిల్ అంబానీని హత్య చేయడానికి ప్రత్యర్థులు కుట్ర చేశారని అనిల్ అంబానీ గ్రూపు ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications