ఎండకు భగ్గుమంటున్న భాగ్యనగరం
హైదరాబాద్: రోజురోజుకు రాష్ట్రం నిప్పుల కొలమిలా మారుతుంది. వడగాల్పుల వల్ల అన్ని ప్రాంతాల్లో సాధారణ కన్నా 5 డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్, మహారాష్టల్ర నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ దాదాపుగా జీరోగా ఉంది. రోజోకో డిగ్రీ పెరుగుతున్న ఉష్ణోగ్రత పెరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 51.4, వరంగల్‌లో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో 43-45 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రత నమోదు అయింది. మే మొదటి వారంలో ఇది గత పదేళ్ళలో రికార్డు అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications