స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు: మంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోందని వైద్య శాఖ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో వ్యాధిని నివారణ మందులను సిద్దంగా వుంచామని ఆయన తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటి వరకు 9,850 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు జరిపినట్లు తెలిపారు. వ్యాధిపై అవగాహనతో పాటు శిక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఢిల్లీ పంపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications