న్యూఢిల్లీ: ఏడో తేదీన జరగనున్న నాలుగోవిడత ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఎనిమిది రాష్ట్రాల్లో 85 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్‌నేత ప్రణబ్ ముఖర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జీడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, భాజపా అధినేత అద్వానీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా విసృతంగా పర్యటించారు.