ఉగ్రవాదులు బీజేపీ అతిధులు: సోనియా

అలాగే 2004లో ఎన్డీఏ నినాదం 'భారత్ వెలిగిపోతోంది'పై ఆమె విమర్శలు గుప్పించారు. "రైతులు, యువత భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు.. భాజపాకు దేశం వెలిగిపోతున్నట్లు కనిపించింది" అని ఎద్దేవా చేశారు. ఆర్థిక మాంద్యంతో ప్రపంచమంతా అల్లాడుతున్నా..భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోవడానికి యూపీఏ సర్కారు చేపట్టిన విధానాలే కారణమని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతిపైనావిరుచుకుపడ్డారు. బీఎస్పీ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని పేర్కొన్నారు.
'ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి దేశప్రజలందరికీ తెలుసు' అని సోనియా అన్నారు. ఉగ్రవాదాన్ని తమ పార్టీ ఉక్కుపాదంతో అణిచేస్తుందని అన్నారు. ఉగ్రవాదంపై బోధనలు ఆపి సొంత వైఫల్యాలపై దృష్టిసారించాలని బీజేపీకి సోనియా అన్నారు.












Click it and Unblock the Notifications