కాంగ్రెస్, బిజెపిలకు దూరం: సిపిఐ
న్యూఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమి అధికారం చేపట్టేందుకే వామపక్షాలు కృషి చేస్తాయని సీపీఐ నాయకుడు రాజా స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరం వామపక్షాలు తమతో కలిసివస్తాయని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రకటనపై స్పందిస్తూ కాంగ్రెస్ ఓటమిదిశగా ఉందనే వార్తలను ఈ ప్రకటన రుజువు చేస్తోందన్నారు. భాజపాను అధికారానికి దూరంగా ఉంచేందుకే తాము కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు మద్దతిచ్చామన్నారు. కేవలం అణుఒప్పందంపైనే కాకుండా అనేక ఇతర అంశాలపై కూడా కాంగ్రెస్ తో తమకు అభిప్రాయభేదాలున్నాయని రాజా పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం వామపక్షాలనే కాకుండా యావత్ దేశాన్ని మోసం చేసిందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications