నేపాల్ లో తొలగని సంక్షోభం
ఖాట్మండ్: నేపాల్ లో ఇంకా రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన తొలగడం లేదు. యూఎంఎల్ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు నేపాలీ కాంగ్రెస్ యత్నిస్తుంటే మావోయిస్టులు మాత్రం సహకరించడం లేదు. ఈ రోజు జరిగిన మిత్రపక్షాల సమావేశానికి కూడా హాజరు కాలేదు. అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ఆర్మీ చీఫ్ కతవాల్ లు వైదొలిగే దాకా ప్రభుత్వంలో చేరమని మావోయిస్టులు తేల్చి చెప్పారు. మరోవైపు ప్రచండ రాజీనామాకు నిరసనగా మావోయిస్టులు నేపాల్ వీధుల్లో విధ్వంసకాండ సృష్టిస్తున్నారు.












Click it and Unblock the Notifications