ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను అభ్యర్థులు ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం కల్పించాలమని ఆయన వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను నియమించామని ఆయన చెప్పారు.
అనంతపురం జిల్లాలో ఈవీఎంల నుంచి శబ్దాలు రావడం బ్యాటరీలోపం వల్లేనని చెప్పారు. అయితే దీనివల్ల కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు వుండవని ఆయన స్పష్టం చేశారు. వర్షంకారణంగా ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లో నీరుచేరడంపై స్పందిస్తూ ఈవీఎంలకు ఎలాంటి నష్టంలేదని తెలిపారు. వర్షం కారణంగా ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే వాటిని శుభ్రపరిచి వేరొకచోటికి తరలించినట్టు సుబ్బారావు తెలిపారు.












Click it and Unblock the Notifications