గుంటూరు: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా నర్సారావుపేట మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జగన్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన కోర్టు హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో జగన్ పై నర్సారావు పేట మెజిస్ట్రేట్ అరెస్టు వారంట్ జారీ చేశారు.
ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో ఆయన కాంగ్రెసు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షోలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి.