అధికారం శాశ్వతం కాదు: బాబు
హైదరాబాద్: అధికార పల్లకీ శాశ్వతం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదనే ఉద్దేశంతో పని చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఆయన చెప్పారు.
పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినవారికి తగిన గుర్తింపు ఇస్తామని, సరిగా నిర్వర్తించనివారిని తప్పించడానికి వెనకాడబోమని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం ఐదేళ్ల పాటు అవినీతిని యధేచ్చగా కొనసాగించిందని ఆయన విమర్శించారు. తాము ఎన్ని తప్పులను ఎత్తి చూపినా కాంగ్రెసు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications