మాకు 160కి తగ్గవు: చిరు
హైదరాబాద్: తమ పార్టీకి 160కి తగ్గకుండా శాసనసభా స్థానాలు వస్తాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. మహిళల ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమకు ఆ నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు. మహిళా రాజ్యం నాయకులతో ఆయన సోమవారం ఎన్నికల సరళిపై సమీక్ష జరిపారు. మహిళలు తమ పార్టీకే ఓటేశారని ఆయన అన్నారు.
మహిళ నాయకులతో ఆయన సరదాగా మాట్లాడారు. మహిళా నాయకుల అభిప్రాయాలకు ఆయన పెద్దగా నవ్వుతూ ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో ప్రజారాజ్యం పార్టీ నేత శోభా నాగిరెడ్డి, మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వేదికపై కూర్చున్నారు.












Click it and Unblock the Notifications