మంచినీటి చెరువులో శవాలు
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో పట్టణ ప్రజలకు రక్షిత నీరు అందించే సమ్మర్ స్టోరేజి చెరువులో రెండు గుర్తు తెలియని శవాలు కనిపించాయి. ఆదివారం సాయంత్రం వరకు అదే చెరువులోని నీరు ఎలివేటెడ్ రిజర్వాయర్లకు చేరింది. ఆ తరువాత కొందరు అందులో శవాలు చూసి పంపింగ్ నిలిపివేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు సోమవారం ఉదయం శవాలను బయటకు తీయించారు.
మృతదేహాలు బాగా ఉబ్బిపోవటంతో వాటిని జాగ్రత్తగా పోస్టుమార్టం కోసం తరలించారు.శవాలు ఉబ్బిపోయి చెరువులో తేలాయి. మృతులు స్థానికేతరులై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications