స్వర్ణదేవాలయంలో కెసిఆర్ పూజలు
అమృతసర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సోమవారంనాడు స్వర్ణదేవాలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆయన మొక్కుకున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు ఇతర తెరాస నాయకులు వినోద్ కుమార్, కెటి రామారావు తదితరులు పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం లూథియానాలో జరిగిన ఎన్డీయె ర్యాలీకి హాజరైన ఆయన రాత్రి అమృతసర్ లో బస చేశారు. సోమవారం నాడు స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. అయితే ఆయన మీడియాతో ఏమీ మాట్లాడలేదు.
తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనంత త్వరగా రావాలని, పంజాబ్ రాష్ట్రం లాగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కెసిఆర్ ప్రార్థనలు చేసినట్లు పార్టీ నాయకులు చెప్పారు. తృతీయ కూటమి ఓ మిథ్య అని, దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర రాదని తాము నమ్ముతున్నామని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిన ఎన్డీయెతో కలిసి పని చేయడానికి సిద్ధపడుతున్నామని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications