నితీష్ సెక్యులరిజం తేలిపోయింది: లాలూ
పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఎన్డీయె ర్యాలీలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లౌకికవాదం ఏపాటిదో తేలిపోయిందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. నితీష్ కు కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సెక్యులర్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాంపూర్ లో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన సోమవారం పాట్నా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నితీష్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి అని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన గుర్తు చేశారు. నితీష్ కు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఇతరులు ఆ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో వేదికను పంచుకోబోనని ప్రకటించి నితీష్ కుమార్ ఢిల్లీలో జరిగిన ఎన్టీయె ర్యాలీలో పాల్గొనలేదని, బీహార్ లో ఎన్నికలు ముగియగానే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని, మోడీతో వేదికను పంచుకున్నారని ఆయన అన్నారు. మీడియా తనపై బురద జల్లే పనికి ఒడి గట్టిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications