రష్యా యువతి మృతి: వెయిటర్లపై దృష్టి
పానాజీ: గోవాలోని రెవోరా గ్రామంలో సంభవించిన రష్యా బాలిక మృతిపై పోలీసులు ప్రగతి సాధించారు. ఆమె శవం రైల్వై ట్రాక్ పై పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇద్దరు ఇండియన్ వెయిటర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 19 ఏళ్ల ఎలెనా సుఖనోవా మృతదేహం ఈ నెల 8వ తేదీన రైల్వే ట్రాక్ పై పడి ఉంది.
ఆమె రాత్రి క్యాబ్ ను తీసుకుని థివిమ్ రైల్వే స్టేషన్ వదిలిపెట్టాలని డ్రైవర్ ను అడిగిందని, స్టేషన్ కు బయలుదేరే ముందు ఆమె మరో ఆరుగురు రష్యన్లతో కలిసి రాత్రి భోజనం చేసిందని, వారి వాంగ్మూలాలు తీసుకున్నామని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ సమ్మీ టావరేస్ చెప్పారు. హోటల్ నుంచి బయలుదేరే ముందు డిస్కోథిక్ కు హాజరైందని, ఆ తర్వాతనే క్యాబ్ ను అద్దెకు తీసుకుందని ఆయన వివరించారు.అయితే ఆమె రెండు రోజుల పాటు మాయమైంది. దీంతో ఇద్దరు వెయిటర్లపై పోలీసుల దృష్టి పడింది.












Click it and Unblock the Notifications