సీరియల్ కిల్లర్ ముఠా అరెస్టు
హైదరాబాద్: తీవ్ర ఘాతుకాలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 26 హత్యలకు, 10 అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలోని కాళహస్తికి ఈ ముఠా చెందినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులను చూసి నగదు, నగలు దోచుకోవడం, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడం వంటి నేరాలకు ఈ ముఠా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలోని నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా ఈ ముఠా తన నేర కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. ఒంటరి వ్యక్తులే ఈ ముఠా లక్ష్యమని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications