దొంగతనంతో పేరుతో వ్యక్తికి నిప్పు
హైదరాబాద్: టీవీ దొంగిలించాడనే నెపంతో ఓ దాబా యజమాని అందులో పనిచేసే వ్యక్తిని పెట్రోలు పోసి కాల్చిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది. కూకట్ పల్లిలోని ప్రగతినగర్ సమీపంలో హమ్ సఫర్ అనే దాబాను మూడురోజులుగా మూసివేశారు. ఆ సమయంలో అందులో ఉన్న టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు.
టీవీని దాబాలో పనిచేసే రాఘవేంద్ర దొంగిలించాడనే అనుమానంతో అతనిపై యజమాని పెట్రోలు పోసి నిప్పంటించారు. అంతకు ముందు అతన్ని చిత్రహింసల పాలు చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలయిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. 23 ఏళ్ల రాఘవేంద్ర వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి ఈ దాబాలో పని చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications