న్యూఢిల్లీ: భారత నావికా దళం మాజీ చీఫ్ ఎస్ ఎం నందా కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరణించినట్లు నావికా దళ అధికారులు మంగళవారం చెప్పారు. వసంత్ కుంజ్ లోని ఫోర్టీస్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
ఆయన భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కంటోన్మెంటులోని బ్రార్ స్క్వేర్ స్మశాన వాటికలో జరుగుతాయి. నందాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆయుధ డీలర్ గా మారారు.