‘అజ్ఞాతవాసి’ పెద్ద ఫ్లాపా? ‘గుంటూరు కారం’ పెద్ద ఫ్లాపా?
నిర్మాత నాగవంశీ ఇటీవల బాక్సాఫీస్ గురించి చేసిన వ్యాఖ్యలు, బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రాల్లో 'అజ్ఞాతవాసి' చిత్రమే అత్యంత పెద్ద ఫ్లాప్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదెలా అనే వివరాలను తెలుసుకుందాం.
బయ్యర్లకు 60 శాతం నష్టాలు
'అజ్ఞాతవాసి' కంటెంట్ పరంగా పూర్తిగా విఫలమై, మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం దెబ్బతినడంతో బయ్యర్లకు దాదాపు 60 శాతానికి పైగా భారీ నష్టాలను మిగిల్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ అని, కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఘోరంగా పరాజయం పాలైందని నిర్మాత నాగవంశీ కూడా స్పష్టంగా ఒప్పుకున్నారు. మరొకవైపు 'గుంటూరు కారం' సినిమా విషయానికి వస్తే... ఇది 'అజ్ఞాతవాసి' అంత పెద్ద డిజాస్టర్ కాదు. 2024 సంక్రాంతి పోటీలో 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కావడం, థియేటర్ల వివాదాలు, సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన నెగిటివిటీ వల్ల కంటెంట్ కంటే బయట ఉన్న పరిస్థితులే ఈ సినిమాను ఎక్కువగా దెబ్బతీశాయి.

గుంటూరు కారం మంచి వసూళ్లే రాబట్టింది
నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ బాబు మాస్ ఇమేజ్, సంక్రాంతి పండుగ కలెక్షన్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. నైజాం, ఓవర్సీస్ మినహా మిగిలిన చోట్ల బాక్సాఫీస్ వద్ద రికవరీ సాధించి ఓ మోస్తరుగా నిలబడింది. కాబట్టి, 'గుంటూరు కారం' పోటీ వాతావరణం, నెగిటివ్ ప్రచారం వల్ల ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... కంటెంట్ లోపంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన 'అజ్ఞాతవాసి' చిత్రమే ఈ రెండింటిలోనూ బిగ్గెస్ట్ ఫ్లాప్. పోటీ వాతావరణంలో గుంటూరు కారంపై దుష్ప్రచారం చేస్తున్నప్పుడు వాటిని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యతలను నిర్మాత, దర్శకులు, హీరో తీసుకోవాలి. అప్పుడే నిర్మాత ఎటువంటి కష్టాలు లేకుండా బయటపడతారు.




Click it and Unblock the Notifications